శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (13:01 IST)

పెళ్లికి షరతులు వర్తిస్తాయ్ : నటి పూర్ణ

పెళ్లికి షరతులు వర్తిస్తాయ్ అంటోంది కేరళ బ్యూటీ. పేరు పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. ఈమె తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఈమె తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తోంది.

పెళ్లికి షరతులు వర్తిస్తాయ్ అంటోంది కేరళ బ్యూటీ. పేరు పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. ఈమె తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఈమె తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తోంది. తమిళంలో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది. కానీ, పెద్ద హీరోల సరసన నటించే అవకాశం మాత్రం రాలేదు. అయినా వచ్చిన అవకాశాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుని నటిస్తోంది.
 
ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, తనకు మలయాళం చిత్రాల కంటే తమిళంలోనే ఎక్కువ పేరు వచ్చిందని... దీనికి కారణం మలయాళంలో పెద్ద హీరోలతో చేయకపోవడమేనని చెప్పింది. పైగా తాను డాన్స్‌ కళాకారిణి కావడంతో తనను స్టేజీలపైనే ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. అందుకే అక్కడ తనకు డాన్స్‌కు అవకాశాలు ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలే వస్తున్నాయి. అలాంటి వాటిని నేను అంగీకరించడం లేదని చెప్పుకొచ్చింది. 
 
ఒక సమయంలో నేను నటించిన 'చట్టకారి' చిత్రం ఫ్లాప్‌ అవడంతో నటనకు స్వస్తి చెప్పి నృత్య కార్యక్రమాలను చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అలాంటి సమయంలో ఇతర భాషల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అవి నమ్మకాన్ని కలిగించడంతో మళ్లీ నటించాలన్న నిర్ణయం తీసుకున్నాను. తమిళంలో నటించిన 'సవరకత్తి', 'కొడివీరన్‌' చిత్రాలు నా మనసు హత్తుకున్నాయి. నా ప్రతిభను వెలికి తీసిన చిత్రాలవి. ప్రస్తుతం నటనకు అవకాశం ఉన్న చిత్రాలనే నటించాలన్న విషయంలో దృఢంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. 
 
అదేసమయంలో ఇపుడు తనకు తరచూ ఓ ప్రశ్న ఎదురవుతోందన్నారు. అదే.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న. తాను ముస్లిం అని, తనకు పెళ్లి చేయాలని ఇంట్లో కూడా అనుకుంటున్నారని పూర్ణ తెలిపింది. అయితే పెళ్లి కోసం వస్తున్నవారు చాలా షరతులు పెడుతున్నారని... ముఖ్యంగా సినిమాలను వదిలేయాలనే కండిషన్ పెడుతున్నారని చెప్పింది. పెళ్లి కోసం తనను తాను మార్చుకోలేనని స్పష్టం చేసింది. పైగా, తనను పెళ్లిచేసుకునే వ్యక్తి కూడా తాను పెట్టే షరతులకు సమ్మతించాల్సిందేనని పూర్ణ కుండబద్ధలుకొట్టినట్టు చెప్పింది.