బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ప్రభాస్ "సలార్" ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు

salaar
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకుడు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగం డిసెంబరు 22వ తేదీన రానుది. దీంతో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ముహూర్తాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసింది. 
 
హోంబలో ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్తగా మరో పోస్టర్‌ను వదిలారు. పూర్తిగా యాక్షన్‌లోకి దిగిపోయిన ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.
 
ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, గరుడ రామచంద్రరాజు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. స్పెషల్ సాంగ్‌లో సిమ్రత్ కౌర్ మెరవనుంది. రవి బస్రూస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.