సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kumar
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (12:26 IST)

డీజే గుడిలో బడిలో మడిలో ఒడిలో పాటలో శృంగారం.. బ్రాహ్మణ సేవా సమతి ఫైర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్ (DJ) విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదల చేసిన డిజే టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సంప

వరుస విజయాలతో దూసుకుపోతున్న మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్ (DJ) విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదల చేసిన డిజే టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విడుదల చేసారు.
 
ఇందులోని "గుడిలో బడిలో మడిలో ఒడిలో" పాట వివాదాస్పదమైంది. ఈ పాటలో శివుడికి అత్యంత ప్రీతికరమైన నమక, చమకాలను అభ్యంతరకరంగా శృంగారంపై ప్రస్తావించడం పట్ల తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రుద్ర శ్లోకంలోని పవిత్రమైన పదాలకు శృంగారపరమైన భావాన్ని ఆపాదించడం తప్పని, అలాగే "‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం" అనే లైన్ బ్రాహ్మణులకు అవమానించేలా ఉందని వారు పేర్కొన్నారు.
 
బ్రాహ్మణులను, వేదాలను కించపరిచేలా ఉన్న ఈ పాటను తక్షణం తొలగించాలని బ్రాహ్మణ సేవా సమితి సెన్సార్ బోర్డ్‌ను కోరింది. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి, సినిమా విడుదలను అడ్డుకుంటామని సమితి గౌరవ అధ్యక్షుడు ఉపేంద్ర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.