సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (17:00 IST)

కరోనా మహమ్మారి నుంచి బయటపడిన మెగా బ్రదర్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అనేక మంది సెలెబ్రిటీలకు సోకుతోంది. వారిలో ఎక్కువ మంది ఈ వైరస్ నుంచి కోలుకుంటున్నారు. కానీ, ఎస్పీబీ వంటి గానగంధర్వుడు ఈ వైరస్ బారినపడి కోలుకున్నప్పటికీ.. ఆ వైరస్ శరీర అంతర్గత భాగాల్లో చేసిన డ్యామేజీ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఇపుడు ఈ వైరస్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా కోలుకున్నారు. 
 
ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ఇటీవ‌ల మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబును ఇబ్బంది పెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు నాగ‌బాబు. అయితే ప్ర‌స్తుతం తాను క‌రోనాను జ‌యించిన‌ట్టు తెలిపిన నాగ‌బాబు .. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న జాగ్రత్తలు, కోలుకున్న విధానాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు తాను ఐదు సార్లు క‌రోనా టెస్ట్ చేయించుకున్న‌ట్టు తెలిపిన నాగ‌బాబు.. నిహారిక నిశ్చితార్ధానికి ముందు కూడా క‌రోనా టెస్ట్ చేయించుకున్న‌ట్టు పేర్కొన్నాడు. అయితే ఇటీవ‌ల కాస్త చ‌లి జ్వ‌రంతో పాటు మ‌త్తుగా అనిపించ‌డంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని అన్నారు. క‌రోనా పాజిటివ్ అంటే ముందు చాలా ఆందోళ‌న‌కు గుర‌య్యాను.
 
గతంలో న్యూమోనియా ఉండడంతో ఆస్పత్రిలో చేరాను. ఐదురోజులు రెమిడెసివిర్ ఔషధాన్ని ఇచ్చారు. జ్వరం ఒళ్లు నొప్పులు తప్ప ఎటువంటి ఇబ్బంది నాకు కలుగలేదని నాగబాబు తెలిపారు. కరోనాకు ఎవరు అతీతులు కారని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వస్తుందని నాగబాబు తెలిపారు. 
 
జ్వరం దగ్గు జలుబు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండని నాగబాబు తెలిపారు. కరోనాకు మందు లేదని.. వైరస్ లోడును బట్టి చికిత్స అందిస్తారని.. కరోనా వైరస్ 14 రోజుల తర్వాత దానంతట అదే చచ్చిపోతుందన్నారు. 14 రోజుల తర్వాత వైరస్ ఉన్నా మనకు హాని కలిగించదని అన్నారు. తాను ఫ్లాస్మా దానం చేస్తానని నాగబాబు ప్రకటించారు.