శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (22:51 IST)

ఏపీలో కరోనావైరస్ పంజా, కొత్తగా 7,293 పాజిటివ్ కేసులు, 57 మంది మృతి

ఏపీలో కరోనా మహమ్మారి తన ఉగ్ర పంజాను విసురుతున్నది. గడిచిన 24 గంటల్లో 75,990 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,011మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.
 
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 57మంది కరోనాతో పోరాడి తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, చిత్తూరు, కడప జిల్లాలో ఎనిమిదేసి మంది చొప్పున మృత్యువాత పడ్డారు. తాజాగా 9,125 మందికి కరోనా నయం అయ్యిందని బులెటిన్లో సూచించారు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751గా పెరిగింది. ఇప్పటివరకు 5,97,294 మంది కరోనా నుంచి కోలుకోగా ఇంకా 65,794 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య తాజా మరణాలతో కలిపి 5,663కి చేరింది.