గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (22:38 IST)

విడవని కరోనా జ్వరం.. ఐశ్వర్య - ఆరాధ్య ఆస్పత్రికి తరలింపు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ వచ్చారు. అయితే, ఆమెకు జ్వరం ఏమాత్రం తగ్గడం లేదు. అలాగే, దగ్గు, జలుబు ఏమాత్రం ఉపశమనం ఇవ్వలేదు. దీంతో ఐశ్వర్యా రాయ్‌ను ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ చిన్నారిని కూడా నానావతి ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, ఇటీవల బాలీవుడ్ స్టార్ అమితాబ్‌తో పాటు.. ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో వారిని ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత బిగ్ బి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
ఇందులో ఐశ్వర్యా రాయ్, ఈమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ అని తేలగా, అమితాబ్ సతీమణి జయా బచ్చన్‌కు మాత్రం నెగెటివ్ అని వచ్చింది. అయినప్పటికీ వీరంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. అలాగే, అమితాబ్ కుటుంబ సభ్యులు నివసించే జల్సా నివాసాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ముంబై మున్సిపల్ అధికారులు ప్రకటించారు.