బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (17:12 IST)

శ్రీలంకలో అట్టహాసంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. ఫోటోలు వైరల్

Daggubati Abhiram
Daggubati Abhiram
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూషల వివాహం శ్రీలంకలో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీ తరలివచ్చింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వధువు ప్రత్యూష దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువని ఆమె స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. కాగా అభిరామ్ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తేజ దర్శకత్వంలో అహింస సినిమా చేసి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు అభిరామ్. 
 
ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకోని రెండో సినిమా చేయాలని అభిరామ్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరి రెండు సినిమాని ఎప్పుడు చేస్తారో చూడాలి. 
 
ఇక రానా విషయానికి వస్తే.. రజినీకాంత్ "తలైవర్ 170" సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే తాను ప్రధాన పాత్రలో "హిరణ్యకశ్యప" అనే మైథాలజీ మూవీ చేయనున్నారు.
Daggubati Abhiram
Daggubati Abhiram