బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (09:21 IST)

నేడు దగ్గుబాటి అభిరామ్ వివాహం

daggubati abhiram
సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా దగ్గుబాటి తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన వివారం గురువారం జరుగనుంది. శ్రీలంకలోని కలుతర పట్టణంలో ఉన్న ఓ దీవి (రిసార్ట్స్)లో ఆయన వివాహం గురువారం రాత్రి 8.50 గంటలకు జరుగనుంది. తనకు వరుసకు మరదలయ్యే ప్రత్యూష చాపరాలను దగ్గుబాటి అభిరామ్ పెళ్లాడనున్నారు. 
 
ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగింది. హల్దీ, మెహందీ కార్యక్రమాలను హైదరాబాద్ నగరంలోనే నిర్వహించారు. వివాహం మాత్రం సముద్రం మధ్యలో ఓ దీవిలో ఉండే కలుతర రివరిసార్ట్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లి వేడుకకు కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ఈ వివాహ వేడుకలను పూర్తి చేసుకుని దగ్గుబాటి సురేశ్ ఫ్యామిలీ శుక్రవారం సాయంత్రానికి నగరానికి చేరుకోనుంది.