సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (17:24 IST)

దర్శకరత్న పరువు తీస్తున్న దాసరి అరుణ్ కుమార్

తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దివంగత దాసరి నారాయణరావు పరువును ఆయన తనయులు గంగలో కలుపుతున్నారు. ఇప్పటికే దాసరి తనయులు ఆస్తుల విషయంలో రోడ్డున పడ్డారు. ఇపుడు హీరో దాసరి అరుణ్ కుమార్ మరోమారు వార్తలకెక్కారు. పీకల వరకు మద్యం సేవించి నానా హంగామా చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రోడ్ నంబరు 12లోని సయ్యద్ నగర్‌కు బుధవారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో మద్యంమత్తులో ఉన్న ఆయన తన వాహనంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కారు కూడా దెబ్బతింది. 
 
దీంతో ద్విచక్రవాహనదారులు దాసరి అరుణ్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 336 సెక్షన్లతో పాటు.. మోటారు వాహన చట్టంతో పాటు.. డ్రంకెన్ డ్రైవ్ కింద కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆయన గురువారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.