గుణశేఖర్ పెట్టింది పెట్టినట్లు వచ్చేస్తుందా...? 'రుద్రమదేవి'కి దాసరి కూడా...
బయట చిత్రాలైనా తన చిత్రమైన ఒక్కటే అనేలా భారీసెట్లు వేసి కోట్లు ఖర్చుపెట్టి తీసిన దర్శకుడు గుణశేఖర్. తన డ్రీం ప్రాజెక్ట్‌గా రెండున్నరేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా 'రుద్రమదేవి'. గత శుక్రవారం విడుదలైన ఈ భారీ హిస్టారికల్ ఫిల్మ్ బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రానా వంటి స్టార్స్ నటించడం ఈ సినిమాకి మొదటి ప్లస్ అయితే, మనకు తెలియని హిస్టారికల్ సినిమాని భారీ సెట్టింగులతో ఆవిష్కరించి చూపించడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. రెండు రాష్ట్రాల్లో మంచిటాక్‌తో రన్ అవుతోంది.
కేవలం లోకల్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా సూపర్బ్ కలెక్షన్స్‌ని రాబట్టుకుంటోంది. కేవలం రెండు రోజుల్లోనే రుద్రమదేవి ఓవర్సీస్‌లో హాఫ్ మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ సినిమా 1 మిలియన్ మార్క్‌కి దగ్గరవుతుందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో 3డి వెర్షన్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ చిత్రంపై దాసరి నారాయణరావు స్పందించారు. గుణశేఖర్ సాహసాన్ని అభినందించారు. తను నిన్ననే సినిమా చూశానంటూ.. ఒక్కొక్క సీన్‌ను గురించి వివరిస్తూ... టీమ్‌ను అభినందించారు.