పవన్ సినిమా కోసం త్రివిక్రమ్‌ను సెలెక్ట్ చేసిన దాసరి..?
టాలీవుడ్ సీనియర్ డైరక్టర్ దాసరి నారాయణ రావు- పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ సినిమాను ప్రొడ్యూస్ చేసే బాధ్యతను దాసరి నారాయణ రావు తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇక దర్శకత్వం బాధ్యతలను త్రివిక్రమ్ చేతిలో పెట్టాలని దర్శకరత్న ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అత్తారింటికి దారేది సినిమా హిట్ కావడంతో.. త్రివిక్రమ్ అయితేనే పవన్ సినిమాకు సరిపోతాడని దాసరి భావిస్తున్నారు.
ఇప్పటికే తెరవెనుక దాసరి-పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలో పవన్ కోసం త్రివిక్రమ్ మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని సినీ జనం అనుకుంటున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
కాగా త్రివిక్రమ్ నితిన్-సమంత హీరోహీరోయిన్లుగా నటించే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సన్నాఫ్ సత్యమూర్తి ఫేమ్ ఎస్. రాధాకృష్ణన్ నిర్మాణ సారథ్యం వహించనున్నారు.