శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (17:05 IST)

డియర్ అనేది అందరూ రిలేట్ చేసుకునే రియలిస్టిక్ సినిమా : హీరో జివి ప్రకాష్ కుమార్

GV Prakash Kumar,  Aishwarya Rajesh,Sandeep Kishan, Rohini and others
GV Prakash Kumar, Aishwarya Rajesh,Sandeep Kishan, Rohini and others
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్'. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణలో విడుదల చేయనుంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో సందీప్ కిషన్, నిర్మాత నాగ వంశీ, దర్శకులు వెంకీ అట్లూరి, నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
 
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. వరుణ్, అభిషేక్, జాన్వి వీరంతా చాలా పద్దతైన నిర్మాతలు. దర్శకుడు ఆనంద్ తెలుగులో ఇంత చక్కగా మాట్లాడటం అభినందనీయం. జీవి నాకు మంచి స్నేహితుడు. కలిసి 'కెప్టెన్ మిల్లర్' చేశాం. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ‘డియర్’ లో తనది చాలా రియలిస్టిక్ యాక్టింగ్. ఆయనకి నిజంగానే నిద్ర వుండదు. నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ నాన్ స్టాప్ గా పని చేస్తుంటారు. ఇందులో ఐశ్వర్య గారి నటన కూడా చాలా సహజంగా వుంది. ఐశ్వర్య చాలా భిన్నమైన కథలు ఎంచుకుంటారు. తనలో చాలా ప్రతిభ వుంది. 'డియర్' టీం అందరికీ ఆల్ ది బెస్ట్. కంటెంట్, ట్రైలర్ అందరూ రిలేట్ చేసుకునేలా వున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 12న తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి' అని కోరారు.  
 
హీరో జివి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ..మా ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరో నాగచైతన్య గారికి థాంక్స్. ఈ వేడుకు విచ్చేసిన మాకు సపోర్ట్ చేసిన సందీప్ కిషన్, వంశీ, వెంకీ, నందిని గారికి ధన్యవాదాలు. డియర్ అందరూ రిలేట్ చేసుకునే సినిమా. ప్రతి సీన్ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా వుంటుంది. మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఐశ్వర్యనే ఈ కథ నా దగ్గరకి తీసుకొచ్చారు. కథ వినగానే చాలా నచ్చింది. దర్శకుడు ఆనంద్ మంచి కథని చక్కగా తీశారు. 'రాజా రాణి' కథ వినప్పుడు ఎలాంటి స్పార్క్ వచ్చిందో ఈ కథ విన్నప్పుడు అలాంటి అనుభూతి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది’ అన్నారు  
 
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. తెలుగు నా మాతృభాష. తెలుగు సినిమానా మనసుకు చాలా దగ్గరైయింది. మంచి కథ, పాత్ర కుదిరితే నేరుగా తెలుగులో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఏ భాష చిత్రమైన కంటెంట్ బావుంటే తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారు. 'డియర్ కూడా అలాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి. జీవి గారు చాలా అద్భుతంగా నటించారు. ఆయన నటన మీ అందరికీ నచ్చుతుంది. ఇందులో నా పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైనది. దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. సినిమా చూసిన తర్వాత చిరునవ్వుతో బయటికివస్తారు ప్రేక్షకులు. టీం అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. డియర్ ని తప్పకుండా థియేటర్స్ లోచూసి సమ్మర్ బ్లాక్ బస్టర్ చేయండి' అన్నారు.
 
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..  జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య, వరుణ్ 'డియర్' టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.  
 
డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ... దర్శకుడు మాటల్లో నిజాయితీ కనిపించింది. సినిమాలో కూడా అది వుంటుదని నమ్ముతున్నాను. ట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది. జీవి నటన, మ్యూజిక్ .. రెండిని అద్భుతంగా బ్యాలెన్స్ చేయడం సర్ప్రైజ్ చేస్తోంది. ఐశ్వర్య డిఫరెంట్ కథలు ఎంచుకుంటారు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ కథతో రావడం చాలా అనందంగా వుంది. ట్రైలర్ చూసినప్పుడు యూనిక్ కాన్సెప్ట్ అనిపించింది. మనందరికీ ఇష్టమైన రోహిణీ గారు కూడా ఈ సినిమాలో వున్నారు. కంటెంట్ బావుంటే తెలుసు ఆడియన్స్ గొప్పగా ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా గొప్పగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. డియర్ మరో సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తుందని భావిస్తున్నాను.
 
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. జివి ప్రకాష్ కుమార్ నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ వెయిట్ చేయించరు. బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. తనతో రెండో సినిమా చేస్తన్నా. డియర్ కంటెంట్, ట్రైలర్ చాలా కొత్తగా వుంది. ఐశ్వర్య క్యారెక్టర్ చాలా అద్భుతంగా వుంది. ఐశ్వర్య మన తెలుగమ్మాయి. ఈ సినిమాతో ఇక్కడ స్థిరపడిపోవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు , టీం అందరికీ ఆల్ ది బెస్ట్. డియర్ తెలుగులో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.    
 
చిత్ర దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ మాట్లాడుతూ..  సందీప్ కిషన్, నాగ వంశీ,వెంకీ అట్లూరి, నందిని గారికి ధన్యవాదాలు. డియర్ నా రెండో సినిమా. లాక్ డౌన్ సమయంలో ఈ కథ రాశాను. గురక పెట్టడం ప్రతి ఇంట్లో సమస్య. ఈ దీనిపై కథ రాయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. నిర్మాతలకు ధన్యవాదాలు. ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన నటి. ఇలాంటి పాత్రలు చేయాలంటే గట్స్ కావాలి. కథ నచ్చిఈ పాత్ర చేశారు. జివి ప్రకాష్ సూపర్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. చాలా అద్భుతంగా తన పాత్రని చేశాను. వారి కెమిస్ట్రీ చాలా బావుటుంది. జీవి ఈ సినిమా కోసం చాలా అద్భుతమైన మ్యూజిక్ కూడా ఇచ్చారు. రోహిణి గారి పాత్ర కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ కి వాయిస్ ఇచ్చిన హీరో నాగచైతన్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ కు థాంక్స్. డియర్ ఫన్ ఫ్యామిలీ డ్రామా. అందరూ రిలేట్ చేసుకుంటారు. ఏప్రిల్ 12 తెలుగులో విడుదౌతుంది. దయచేసి సినిమాని థియేటర్స్ లో చూడండి' అని కోరారు.
 
 నటి రోహిణి మాట్లాడుతూ.. డియర్ చాలా క్యూట్ స్టొరీ. రిలేషన్ షిప్ లో సర్దుకుపోలేని విషయాలు వుంటే ఏం జరుగుతుందనే అంశాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ఆనంద్ చాలా అద్భుతంగా తీశారు. జీవి ప్రకాష్, ఐశ్వర్య చాలా చక్కగా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.  
 
నిర్మాత వరుణ్ త్రిపురనేని.. డియర్ మాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్. ఆనంద్ అద్భుతంగా తీశాడు. చిత్ర యూనిట్ మొత్తానికి థాంక్స్. ఈవేడుకు అతిధులుగా వచ్చిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు'' తెలిపారు.
 
నిర్మాత అభిషేక్ రామిశెట్టి.. డియర్ మా ఫస్ట్ తెలుగు రిలీజ్. మా టీం అందరికీ థాంక్స్. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్, నాగ వంశీ,వెంకీ అట్లూరి, నందిని గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా కష్టపడి ఇష్టంతో చేశాం. అందరూ తప్పకుండా సినిమా చూడాలి' అని కోరారు.