ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (13:46 IST)

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ల డియర్ విడుదల చేసున్న అన్నపూర్ణ స్టూడియోస్

GV Prakash, Aishwarya Rajesh
GV Prakash, Aishwarya Rajesh
జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా 'డియర్'. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.   తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది.
 
ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.  హ్యూజ్ థియేట్రికల్ చైన్ బిజినెస్లు ఉన్న ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ సంస్థల బ్యాకింగ్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో  చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు, ఇటీవలి చార్ట్‌బస్టర్ పాట "మాస్టారు మాస్టారు" ఇప్పటికీ చార్టులలో కొనసాగుతోంది. తమిళంలో విడుదలైన రెండు పాటలు చార్ట్‌లలో ఆదరగొడుతున్నాయి. త్వరలో తెలుగులో కూడా విడుదల కానున్నాయి.
 
డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.