శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (14:15 IST)

దీపావ‌ళి స్పెష‌ల్ షో..ఎన్టీఆర్‌తో దేవిశ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్ స‌ర‌దా ఎపిసోడ్‌

Thaman-Devisri-NTR
ప్ర‌ముఖ తెలుగు ఛానెల్ జెమినీటీవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా ప్రారంభ‌మైన షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో దీపావ‌ళి కానుక‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నారు. 
 
అది కూడా ఏకంగా ఇద్ద‌రు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌తో వారే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌. తార‌క్‌తో వీరిద్ద‌రూ చేసిన స‌ర‌దాను దీపావ‌ళికి ఎంజాయ్ చేసేయాల్సిందే. దీనికి సంబంధించిన ప్రోమోను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ప్రోమో చూస్తుంటేనే ఎంతో స‌ర‌దా స‌ర‌దాగా అనిపించింది. పూర్తి ఎపిసోడ్ మాత్రం న‌వంబ‌ర్ 4 రాత్రి 8గంట‌ల 30నిమిషాల‌కు ప్రసారం అవుతుంది. ఇక ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా సంక్రాంతికి విడుద‌ల‌కాబోతుంది. ఈ ఎపిసోడ్ ఆయ‌న సినిమా ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డనుంది.