శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (19:03 IST)

థియేటర్లలో "ధమాకా" - టెన్ డేస్‌లో రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

dhamaka
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం "ధమాకా". ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. మాస్ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. విడుదలైన తొలి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఫలితంగా పది రోజుల్లో ఏకంగా రూ.89 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ చిత్రంలో పాటలతో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన చిత్రం ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. దీంతో వచ్చే వారానికి వంద కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
dhamaka
 
ఈ నెల 23వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి రోజునే రూ.10 కోట్లకి పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. పది రోజుల్లో రూ.89 కోట్లకిపైగా గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. రవితేజ నటించిన రెండు చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో రవితేజ పనై పోయిందనే కామెంట్స్ వినిపించాయి. కానీ, రవితేజ మార్క్ మూస స్టోరీ కావడంతో ధమాకా ఆటంబాబులా పేలింది. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులతో థియేటర్లలో సందడి చేయిస్తుంది.