గురువారం, 21 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 జులై 2024 (18:03 IST)

టికెట్ రేట్ ₹100 పెట్టినా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం: పేక మేడలు ప్రీ రిలీజ్ లో ధీరజ్ మొగిలినేని

Peka Medalu pre-release event
Peka Medalu pre-release event
వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇటీవలే వైజాగ్, విజయవాడలో వేసిన స్పెషల్ షోస్ లో పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19న పేక మేడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ సందర్భంగా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ : ఈ సినిమా చూసి నచ్చి ఇంకా బాగా ప్రమోట్ చేయొచ్చు అనిపించింది. ఇలాంటి సినిమాని మంచిగా ప్రమోట్ చేసి ప్రేక్షకులు ముందు తీసుకెళ్తే ఇంకా పెద్ద విజయం అవుతుంది. పెద్ద సినిమాలు ఏ రేట్ పెట్టిన ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు కానీ చిన్న సినిమాలు కి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. ఈ సినిమా కోసం టికెట్ రేట్లను ₹100 కు తగ్గించాం. పెద్ద సినిమాలతో పోటీ పడలేక చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రేక్షకులకు మంచి అందించే ప్రయత్నంలోనే విజయవాడ, వైజాగ్ హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపాయలకే టికెట్ రేట్ పెట్టి ఎక్కువమంది సినిమా చూసేలాగా ప్లాన్ చేసాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈనెల 19న విడుదలవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని నమ్మకం నాకుంది అన్నారు.
 
డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : మా సినిమాని సపోర్ట్ చేసి ఇంత మంచిగా ప్రమోట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పెయిడ్ ప్రీమియర్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ప్రీ సక్సెస్ మీట్ లాగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గా సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి వచ్చిన ధీరజ్  గారికి కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరోయిన్ అనూష కృష్ణ మాట్లాడుతూ, మేము ఎంత ఇష్టంగా ఈ సినిమా తీసాము ప్రేక్షకులకు అంతే నచ్చుతుంది. ఈ 19న సినిమా రిలీజ్ అవుతుంది అందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ : వైజాగ్, విజయవాడలో పెయిడ్ ప్రీమియర్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి చేస్తున్న వినూత్న ప్రమోషన్స్ చూసి పేక మేడలు హీరోగా నన్ను గుర్తు పడుతున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
 
నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ, ధీరజ్ నాకు ముందు నుంచే పరిచయం ఉన్న ఈ సినిమా చూసి నచ్చి నేను రిలీజ్ చేస్తాను ముందుకు వచ్చాడు. ధీరజ్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సినిమాను సపోర్ట్ చేస్తున్న రానా దగ్గుబాటికి, అడివి శేష్ కి, విశ్వక్ సేన్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.