సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (15:52 IST)

నిర్మాత దిల్ రాజు ఇంటి విషాదం.. బోరున ఏడ్చేశారు...

dil raju father
ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాం సుందర్ రెడ్డి (86) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. 
 
దిల్ రాజు ఇంటికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాం సుందర్ రెడ్డికి నివాళులు అర్పించారు. మరోవైపు, దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌ను చూడగానే దిల్ రాజు బోరున విలపించేశారు. దీంతో రాజుకు ప్రకాష్ రాజ్ ధైర్యం చెప్పి ఓదార్చారు.