శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:55 IST)

రౌడీ బాయ్స్ గుడ్ బాయ్స్ ఎలా అయ్యార‌నేదే క‌థః దిల్‌రాజు

Rowdy Boy team
దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్ (శిరీష్ త‌న‌యుడు). శుక్ర‌వారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను వైజాగ్‌లోని విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు.
 
ఈ సంద‌ర్భంగా రోల్ రైడా మాట్లాడుతూ ``ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. ఇలాంటి పాట‌కు అవ‌కాశం రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సాంగ్‌కు ఆశిష్ స్టెప్పులు ఇర‌గ‌దీశాడు. దేవిశ్రీగారి పాట‌కు పాడ‌టం నాకొక మైల్‌స్టోన్‌. హుషారు త‌ర్వాత శ్రీహ‌ర్ష మ‌రో హిట్ కొట్ట‌డం ప‌క్కా`` అన్నారు. 
 
ఆశిష్ రెడ్డి మాట్లాడుతూ ``వైజాగ్‌లో మా రౌడీబాయ్స్ సాంగ్స్ విడుద‌ల కావ‌డం హ్యాపీగా ఉంది. మా సాంగ్‌కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చాలా స‌పోర్ట్ చేసింది. విక్ర‌మ్‌కు థాంక్స్‌. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌కు థాంక్స్‌. అక్టోబ‌ర్‌లో క‌లుద్దాం`` అన్నారు. 
 
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ``రౌడీబాయ్స్ చాలా మంది ఉన్నారు. బ్యూటీఫుల్‌గా క‌నిపించే రౌడీ గ‌ర్ల్స్‌కు థాంక్స్‌. మా టీమ్‌ను స‌పోర్ట్ చేసినందుకు విజ్ఞాన్ కాలేజ్ వాళ్ల‌కు థాంక్స్‌. ఈ సినిమాకు ఫ‌స్ట్ హీరో దేవిశ్రీ ప్ర‌సాద్‌. త‌న‌తో పదిహేడేళ్ల అనుబంధం ఉంది. 8 సాంగ్స్ ఉంటాయి. త‌ను ప్ర‌తి పాట‌ను అద్భుతంగా ఇచ్చాడు. త‌ర్వాత హీరో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఇద్ద‌రు హీరోల‌కు పోటీ పెట్టే అమ్మాయిగా త‌ను అద్భుతంగా న‌టించింది. త‌ర్వాత హీరో శ్రీహ‌ర్ష‌. హుషారు త‌ర్వాత త‌ను చేసిన సినిమా ఇది. ఆశిష్‌తో సినిమా అనుకోగానే, ఔట్ అండ్ ఔట్ కాలేజ్ యూత్ స్టోరి కావాల‌ని అడిగాను. పాతికేళ్ల ముందు యూత్‌ను ప్రేమ‌దేశం షేక్ చేసింది. తర్వాత హ్యాపీ డేస్ చూశాం. అది కూడా షేక్ చేసింది. యూత్ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింద‌నిపించ‌డంతో అలాంటి సినిమా కావాల‌ని శ్రీహ‌ర్ష‌ను అడిగాను.

అప్పుడు శ్రీహ‌ర్ష‌.త‌న కాలేజీ లైఫ్‌లో జ‌రిగిన ఇన్సిడెంట్స్‌తో క‌థ రాసుకుని సినిమా చేశాడు. ఆశిష్‌, విక్ర‌మ్ గురించి రిలీజ్ త‌ర్వాత మాట్లాడుతాను. వీళ్లంద‌రినీ క‌లిపి న‌డిపించ‌డానికి వెనుక నేనున్నాను.  ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ నాలుగేళ్ల జ‌ర్నీ. రెండు కాలేజీల మ‌ధ్య జ‌రుగుతుంది. అన్నీ యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. రౌడీ బాయ్స్  గుడ్ బాయ్స్ ఎలా అయ్యార‌నేదే క‌థ‌. కాలేజ్‌లో జ‌రిగే మీ అంద‌రి స్టోరి. ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. మీరు ఇన్ని రోజులు మిస్ అయిన‌వ‌న్నీ ఈ సినిమాలో చూస్తారు`` అన్నారు.