పాలిక్ దర్శకత్వంలో తెలంగాణలో జరిగిన యథార్థ కథతో సినిమా ప్రారంభం
డైరక్టర్ పాలిక్. తాజాగా తన దర్శకత్వంలో బియస్ ఆర్ కె క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భోగి సుధాకర్, రావుల రమేష్ నిర్మాతలు. ఈ చిత్రం ఈ రోజు ఫిలింనంగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ ముహూర్తపు న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అంద చేయగా దర్శకుడు, నటుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూ...``ఇప్పటికే పాలిక్ గారి దర్శకత్వంలో `రౌద్ర రూపాయ నమః` చిత్రం నిర్మించాను. మొత్తం పూర్తయింది. అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక ఆయన దర్శకత్వంలోనే ప్రొడక్షన్ నెం-2 చిత్రం ప్రారంభించాము. ఇదొక పీరియాడికల్ ఫిలిం. ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ఉంటాయి. మిత్రుడు సుధాకర్ గారితో కలిసి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నా`` అన్నారు.
మరో నిర్మాత భోగి సుధాకర్ మాట్లాడుతూ, పాలిక్ కు నా దగ్గర ఉన్న కథ వినిపించాను. తనకు బాగా నచ్చింది. ములుగు , వరంగల్ , అరకు ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. ఒక మంచి చిత్రంగా దీన్ని తెరకెక్కించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సీనియర్ ఆర్టిస్ట్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నా చిన్ననాటి మిత్రుడైన రమేష్ రావుల తో కలిసి నిర్మించడం చాలా సంతోషంగా ఉంది`` అన్నారు.
దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ, నా మీద , నా కథ మీద నమ్మకంతో అవకాశం కల్పించారు. కరోనాకి ముందు వెంచపల్లి చిత్రాన్ని ప్రారంభించాం. ఆ సమయంలోనే కాంతార సినిమా వచ్చింది. మా కథ కూడా కాంతార చిత్రం కథకి దగ్గరగా ఉండటంతో కథలో మార్పులు చేసి మళ్లీ కొత్తగా ఈ సినిమా ప్రారంభిస్తున్నాం. ఇది 1960-1980 మధ్య తెలంగాణలో జరిగిన యథార్థ కథకు ఆధారంగా తెరకెక్కించే పీరియాడిక్ మూవీ ఇది. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలుంటాయి. జాన్ భూషణ్ అద్భుతమైన ఆరు పాటలు అందించారు. దానికి సురేష్ గంగుల సాహిత్యాన్ని సమకూర్చారు. కథే హీరోగా ఈ సినిమాని తెరకెకిస్తున్నాం.` అన్నారు.