శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

సికింద్రాబాద్ పాలికా బజార్‌లో భారీ అగ్నిప్రమాదం

fire accident
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున స్థానిక బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలికా బజార్ ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల దుకాణంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. 
 
ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. దాని చుట్టుపక్కల మరిన్ని దుకాణాలతో పాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 
 
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సికింద్రాబాద్ పరిధిలో గత కొంతకాలంగా రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఓ లాడ్జిలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.
 
ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం 
 
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు దళిత బాలికలను కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు వారం రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. లాతేహర్ జిల్లా బరవా‌డీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ బాలికలు ఇటీవల అదృశ్యమయ్యారు. మైనర్ల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బరవాడీ‌‍హ్ ఎస్పీ అంజనీఅంజన్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 
 
సిట్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో ఆ బాలికలను గార్వాకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు తేలింది. ఆ తర్వాత వారి ఆచూకీ కనుగొని రక్షించింది. తమను ఓ ఇంట్లో బంధించి వారం రోజుల పాటు అత్యాచారం చేశారని బాలికలు బోరున విలపిస్తూ చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో నలుగురు కామాంధులను అరెస్టు చేశారు.
 
ఉరేసుకుని ఎస్ఐ భార్య ఆత్మహత్య 
 
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజుపాలెం ఎస్ఐ భార్య మేర్లపాక నారాయణ భార్య లక్ష్మిగీత (28) బలవన్మరణానికి పాల్పడింది. తన చీరతోనే ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానికులు వెల్లడిచిన వివరాల మేరకు.. ఉదయం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మిగీత మనస్తాపం చెంది వేరే గదిలోకి వెళ్ళి ఫ్యాన్‌కు చీరలో ఉరేసుకునంది. దీన్ని గుర్తించిన ఎస్ఐ భర్త వెంటనే తలపులు పగులగొట్టి అమెను రక్షించి పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
 
ఎస్ఐ నారాయది సొంతూరు చిట్టమూరు మండలం గుణపాడు కాగా, లక్ష్మిగీతది రేణిగుంట. వీరికి మూడేళ్ల క్రితం వివాహం కాగా, మూడేళ్ల చైత్ర అనే కుమార్తె ఉంది. తమ కుమార్తె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు వారిద్దరూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం నారాయణ ఎస్ఐ ఉన్నతాధికారుల అనుమతితో సెలవు కూడా తీసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ, పాలుతాగే పసిపాని వదిలి లక్ష్మిగీత గదిలోకి వెళ్లి చీరకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.