శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (11:40 IST)

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

road accident
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను, మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.