గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (09:34 IST)

మీ పాటలే మా పాఠాలు.. కానీ మధ్యలోనే వదిలేశారు గురూజీ : మారుతి ట్వీట్

ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్ర ఆకస్మిక మృతిపై సినీ లోకం కన్నీరు కార్చుతోంది. ఆయన మృతిని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ తన ఆవేదనతో పాటు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా సినీ దర్శకుడు మారుతి కూడా ఓ ట్వీట్ చేశారు. "మీ పాటలే మేము నేర్చుకున్న పాఠాలు. మీ సూక్తులు మేము రాసుకునే మాటలు. బ్రహ్మ ఒక్కరే కష్టపడుతున్నారని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? 
 
నా పాటను పూర్తి చేసి వెళ్లిపోయారు. కానీ పాఠం మధ్యలోనే వదిలేశారు గురూజీ.. భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.