ఆర్ట్ డైరెక్టర్‌లతో డైరెక్టర్ల బంధం ఎంతో ముఖ్యమైంది : హరీష్ శంకర్
తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రమణ వంక, ప్రధాన కార్యదర్శిగా కెఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇతర పాలక సభ్యులు ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు.
Art Directors association
ఈ సందర్భంగా నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ''తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మాతల బాధ్యతల గురించి ఆలోచించాలని, కలిసి కట్టుగా ముందుకు వెళదాం'' అని చెప్పారు.
తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రమణ వంక మాట్లాడుతూ.. ''ఆర్ట్ విభాగం అనేది ఇండస్ట్రీలో కీలకమైంది. సినిమాలో అన్ని విభాగాల్లోకి సాంకేతికత వస్తోంది. ఆర్ట్ విభాగంలోనూ ఏఐ, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ మొదలైంది. ఈ తరుణంలో టెక్నాలజీ సంస్థలతో మేము కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాము. మా డిఫర్ట్‌మెంట్ సభ్యులు ఎందుర్కొంటున్న పలు సమస్యలను తీర్చడానికి అసోషియేషన్ కృషి చేస్తుంది'' అని తెలిపారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ''నేను కూడా ఆర్ట్ డైరెక్టర్‌నే. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచే వచ్చి డైరెక్టర్ అయ్యాను. ఆర్ట్ విభాగం విలువ నాకు తెలుసు. ఇతర భాషల వారిని తెచ్చుకోకుండా అద్భుతమైన టాలెంట్ ఉన్న తెలుగు ఆర్ట్ డైరెక్టర్లనే తీసుకొండి. బాధ్యతలు స్వీకరించిన తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు.'' అని దిల్ రాజు చెప్పారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''మా ఆర్ట్ డైరెక్టర్‌లతో మా డైరెక్టర్ల బంధం ఎంతో ముఖ్యమైంది. సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలబడి ఎంతో కష్టపడతారు. డైరెక్టర్ల తర్వాత అంతటి కృషి కూడా వారిదే కాబట్టి వారిని ఆర్ట్ డైరెక్టర్లు అంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ల సమస్యలు కూడా తీరాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.'' అని అన్నారు.
ప్రధాన కార్యదర్శి కె.ఎం. రాజీవ్ నాయర్ మాట్లాడుతూ.. ''అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి సమస్య వచ్చిన కూడా వారికీ అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఎటువంటి భేషజాలు లేకుండా అందరికి సమ న్యాయం చేసి వారు వృత్తి పరంగా, ఆర్థిక పురోగతికి అండగా ఉండేలా అసోసియేషన్ తరఫున కృషి చేస్తాం'' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.