ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (10:25 IST)

ఆదిపురుష్ కోసం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఏమి చేసాడో తెలుసా..

Adipurush palnadu colector
Adipurush palnadu colector
ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన పౌరాణిక నేపథ్య చిత్రం ఆదిపురుష్ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అద్భుత విజయం దిశగా సాగుతోంది. ఈ చిత్రాన్ని పెద్దలతో పాటు పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ నరసరావుపేటలోని అనాథ పిల్లలు, సోషల్ వెల్ఫేర్ విద్యార్థినీ విద్యార్థులకు ఆదిపురుష్ చిత్రాన్ని విజేత థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. 
 
పిల్లలతో కలిసి కలెక్టర్ శివశంకర్ సినిమాను వీక్షించారు. త్రీడీ ఫార్మేట్ లో పిల్లలు ఆదిపురుష్ చిత్రాన్ని బాగా ఆస్వాదించారని, సినిమా చూస్తున్నంత సేపు వారి సంతోషానికి హద్దులు లేవని కలెక్టర్ చెప్పారు. దాదాపు 500 మంది పిల్లలు ఆదిపురుష్ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు.