మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (16:00 IST)

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ గా డ్రీం క్యాచర్

Aneesh Dama
Aneesh Dama
పోస్టర్స్ చూస్తుంటే కొత్త దర్శకుడి గా కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా  అందరు  కొత్త గా చేసిన ఈ సినిమా కి చాలా మంచి భవిష్యత్ ఉందని “డ్రీం క్యాచర్ ”  డ్రీమ్ బేసిడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ . ఫస్ట్ లుక్,  టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు , బెస్ట్ విషెష్ తెలిపారు 
 
Prashanth Krishna, Archisha Sinha, Srinivas Ramireddy
Prashanth Krishna, Archisha Sinha, Srinivas Ramireddy
సి ఎల్ మోషన్ పిక్చర్స్  పతాకంపై సందీప్ కాకుల ప్రొడ్యూసర్ గా మరియు నిర్మాణం సారధ్యం లో ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రాంరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, సందీప్ కాకుల  నిర్మించిన “డ్రీం క్యాచర్ ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్  లో ఘనంగా జరిగింది. సందీప్ కాకుల  టాలెంటెడ్  డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కళ ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా అతిధులు పేర్కొన్నారు.
 
 “డ్రీం క్యాచర్ ” చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే  దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా  తెరకెక్కించానని, ఈ ఏడాది మంచి  చిత్రం గా  నిలిచే చిన్న చిత్రాల జాబితాలో సూపర్  చిత్రంగా మలచిన " డ్రీం క్యాచర్ " చిత్రం కచ్చితంగా చేరుతుందని, క్లైమాక్స్  చిత్రీకరించి తీరు చూస్తే హౌరా అనిపించే విధంగా ఉంటుంది అని చెప్పారు.   “డ్రీం క్యాచర్ ” చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని నటులు ప్రశాంత్ కృష్ణ, పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకడు కి హీరోయిన్ అనీషా ధామ  కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రోహన్ శెట్టి మరియు ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద తదితరులు పాల్గొని “డ్రీం క్యాచర్ ” ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. నటి నటులు: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ , శ్రీనివాస్ రాంరెడ్డి  , ఐశ్వర్య హోలక్కల్,  ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాంకేతిక వర్గం: పి.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి,  డి.ఐ: శ్రీనివాస్ మామిడి , వి.ఎఫ్.ఎక్స్: శ్రీకాంత్ శాఖమూరు , సంగీతం: రోహన్ శెట్టి  ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద , కూర్పు: ప్రీతం గాయత్రి ,  నిర్మాత: సందీప్ కాకుల  రచన – దర్శకత్వం: సందీప్ కాకుల.