శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:37 IST)

దుల్కర్ సల్మాన్‌ను ''ఐ హేట్ యూ'' అన్నారా?

దుల్కర్ సల్మాన్.. యూత్ మధ్య మంచి పేరున్న హీరోగా గుర్తింపు సంపాదించాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడిగా కాకుండా దుల్కర్ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించిపెట్టాడు. ''ఓకే బంగారం'' సినిమాలో ప్రేమికుడిగ

దుల్కర్ సల్మాన్.. యూత్ మధ్య మంచి పేరున్న హీరోగా గుర్తింపు సంపాదించాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడిగా కాకుండా దుల్కర్ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించిపెట్టాడు. ''ఓకే బంగారం'' సినిమాలో ప్రేమికుడిగా అలరించిన దుల్కర్, మహానటిలో నెగటివ్ పాత్రను పోషించాడు. ఈ రెండు సినిమాలు దుల్కర్‌కు నటుడిగా మంచిపేరు సంపాదించిపెట్టాయి. 
 
కానీ కొందరు మహిళా ఫ్యాన్స్ మాత్రం మహానటి సినిమాను లైట్ గా తీసుకోలేదని దుల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఈ సినిమాలో తన పాత్రతో హర్ట్ అయ్యారని వెల్లడించాడు.
 
మహానటి సినిమా చూశాక చాలామంది మహిళా అభిమానులు సోషల్ మీడియాలో ''ఐ హేట్ యూ'' అంటూ కామెంట్లు పెట్టారని తెలిపాడు. ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర కావడంతోనే ప్రతినాయక ఛాయలున్నా నటించేందుకు అంగీకరించానని దుల్కర్ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు మొత్తం యువ బృందమే పనిచేసిందనీ, ఓ మంచి సినిమాలో భాగం కావాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టులో చేరినట్లు దుల్కర్ అన్నాడు. 
 
మెగాస్టార్ అయినా తన తండ్రి మమ్ముట్టి పేరును సినిమాల్లో లేదా బయట ఉపయోగించుకోవడం తనకు ఇష్టం లేదని దుల్కర్ వ్యాఖ్యానించాడు. చెన్నైలో పుట్టి, పెరిగిన తనకు తమిళం, మలయాళం వచ్చనీ, మహానటి సమయంలో తెలుగులో డైలాగులు చెప్పేందుకు మాత్రం బాగా ఇబ్బంది పడ్డానని దుల్కర్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో అందరం కలిసి సినిమాలు చూస్తామని.. తాను ముందు వరుసలో కూర్చుని చూస్తూ వుంటానని.. తన తండ్రి బాగుందని చెప్పే ప్రశంసలను గొప్పవిగా భావిస్తానని చెప్పుకొచ్చాడు.