మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (13:53 IST)

లైంగిక వేధింపులు సినీ రంగానికే పరిమితం కాదు.. అన్నీ చోట్లా వున్నాయి

మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న వారిలో ఒకరైన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్.. బాలీవుడ్ హీరోయిన్లు ఎదుర

మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న వారిలో ఒకరైన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్.. బాలీవుడ్ హీరోయిన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై స్పందించాడు. మీటూలో భాగంగా బాలీవుడ్‌లో హీరోయిన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీడియా ద్వారా పంచుకుంటున్నారు. 
 
తాజాగా నటి స్వర భాస్కర్ మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు మద్యం తాగి, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులు ఒక్క సినీ రంగానికే పరిమితం కాదని.. అన్నీ చోట్లా వున్నాయన్నాడు.
 
ఈ విషయంలో కేవలం ఫిలిమ్ ఇండస్ట్రీని మాత్రమే బలి చేయడం సబబు కాదన్నాడు. బాధిత మహిళలు ఏదో రూపంలో తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేయాల్సిందేనని.. న్యాయం లభించేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. లైంగిక వేధింపులకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని తెలిపాడు.