శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (19:31 IST)

వైమానిక దళం యూనిఫాం ధరించి ముద్దులా.. నోటీసులు

Hrithik-Deepika
Hrithik-Deepika
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ - దీపికా పదుకొనే కిస్ సీన్‌పై ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లీగల్ నోటీసు పంపారు. బాలీవుడ్ సెలబ్రిటీలు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన యాక్షన్ మూవీ 'ఫైటర్'లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంటుంది.
 
ఈ సీన్‌కు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అస్సాంకు చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య దీప్ దాస్ సంబంధిత చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసు పంపారు. సౌమ్యదీప్ దాస్ మాట్లాడుతూ, 'హృతిక్ రోషన్- దీపికా పదుకొణె భారత వైమానిక దళం యూనిఫాం ధరించి ముద్దులు పెట్టుకున్నట్లు చూపించారు. ఇలాంటి దృశ్యాలు భారత వైమానిక దళాన్ని అవమానించడమేనని నేను భావిస్తున్నాను. 
 
భారత వైమానిక దళం యూనిఫాం దేశం రక్షణ, నిస్వార్థ సేవ శక్తివంతమైన చిహ్నం. వ్యక్తిగత ప్రేమ వ్యవహారాలను ప్రోత్సహించే సన్నివేశం కోసం భారత వైమానిక దళం యూనిఫామ్‌ను ఉపయోగించడం దాని గౌరవాన్ని తప్పుగా సూచించడమే. కాబట్టి ఈ దృశ్యాలను తొలగించాలి. ఈ విషయంలో చిత్ర నిర్మాత వివరణ ఇవ్వాలి' అని అన్నారు.