బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (12:21 IST)

''నోటా''కు ఓటేసిన అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు తర్వాత హీరో విజయ్ దేవరకొండకు భారీ ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికి ఆరు సినిమా వరకు విజయ్ చేతిలో వున్నాయి. మరిన్ని ఆఫర్లు వస్తూనే వున్నాయి. తె

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు తర్వాత హీరో విజయ్ దేవరకొండకు భారీ ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికి ఆరు సినిమా వరకు విజయ్ చేతిలో వున్నాయి. మరిన్ని ఆఫర్లు వస్తూనే వున్నాయి. తెలుగులోనే కాకుండా కోలీవుడ్‌లోనూ అర్జున్ రెడ్డి ఆఫర్లు తగ్గట్లేదు. తెలుగులో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 
 
ఓ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏ మంత్రం వేసావె సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే తమిళంలోను అర్జున్ రెడ్డి ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమాకి ''నోటా'' (nota) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
 
ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తే ఈవీఎంలో నోటా అనే ఆప్షన్ వుంటుంది. ఈ నోటాకు ఓటేయడం ద్వారా ఈవీఎంలో సూచించిన అభ్యర్థులనెవరినీ నేను ఎన్నుకోవడం లేదని అర్థం. అలా నోటాకు ఓటేసి వేలిని చూపిస్తున్న పోస్టర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే నోటా చిత్రంలో ఇంతవరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా అర్జున్ రెడ్డి కనిపిస్తాడని, అర్జున్ రెడ్డి సరసన మెహ్రీన్ నటిస్తుందని సినీ యూనిట్ ప్రకటించింది.