ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (18:27 IST)

యస్... ఆ కన్నడ బ్యూటీలు డ్రగ్స్ తీసుకున్నారు..

కన్నడ సినీ పరిశ్రమను డ్రగ్స్ కేసు ఊపేస్తోంది. అగ్రతారలు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట్లో సంజన, రాగిణిని విచారించిన పోలీసులు ఆ తరువాత రిపోర్ట్ కోసం ఎదురుచూశారు.
 
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హీరోయిన్లు సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్‌ రిపోర్టులో వెలుగు చూసింది. దీంతో మరోసారి సంజన, రాగిణికి సమన్లు జారీ చేయనున్నారు బెంగుళూరు పోలీసులు.
 
మొదటగా బ్లడ్ నమూనాలను సేకరించారు పోలీసులు. అందులో ఏదీ తేలకపోవడంతో వారి వెంట్రుకల నమూనాలను సేకరించి పంపారు. దీంతో నిజాలు వెలుగుచూశాయి. సమన్లు ఇచ్చిన వెంటనే ఇద్దరు హీరోయిన్లు మళ్ళీ విచారణకు వెళ్ళాల్సి ఉంటుంది.
 
ఈ హీరోయిన్ల వ్యవహారం కాస్త కన్నడ సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పుడిప్పుడే మంచి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అవుతున్న పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం పెద్ద చర్చకు దారితీస్తోంది.