మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (17:18 IST)

భార్యతో బుమ్రా ఇంటర్వ్యూ.. పెళ్లికి తర్వాత జీవితమే మారిపోయింది..!

భార్యతో టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తరపున కీలక బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వ్యక్తిగత కారణాలతో మధ్యలోనే వైదొలిగిన బుమ్రా న్యూస్‌ ప్రెజెంటర్‌ సంజనా గణేషన్‌ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలాసార్లు పంచుకున్నారు. 
 
తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సమాయత్తమవుతున్న బుమ్రాను తన భార్య సంజనా గణేషన్‌ ఇంటర్య్వూ చేసిన వీడియోను ఐసీసీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో తన చిన్ననాటి విషయాలతో పాటు పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. 
 
చిన్నప్పుడు చెల్లితో క్రికెట్‌ ఆడడం.. ఆ తర్వాత స్కూల్‌ దశలో ఆడిన రోజులను ఎప్పటికి మరిచిపోను అంటూ తెలిపాడు. ముఖ్యంగా తన పెళ్లి తర్వాత మరో కొత్త జీవితం మొదలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. పెళ్లి రీత్యా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అనంతరం ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున బరిలోకి దిగిన బుమ్రా 7 మ్యాచ్‌లాడి 6 వికెట్లు తీశాడు.