మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (20:55 IST)

ఇలియానా పంట పండింది, భారీ సంస్థ చేతుల్లో పడింది, కరోనాలోనూ కోట్లే?

ileana
న‌టి ఇలియానా సినిమాలు చేసి చాలా కాల‌మైంది. క‌రోనా టైంలో అస్స‌లు లేనేలేవు. అందుకే ప‌లువురు నాయిక‌లు ఓటీటీ ప్లాట్‌ఫార‌మ్ వైపు మొగ్గులు చూపుతున్నారు. మ‌రికొంద‌రు టీవీ షోలు నిర్వ‌హిస్తున్నారు. భ‌విష్య‌త్ తెలిసిన స‌మంత ఆహా ఓటీటీ ద్వారా స‌రికొత్త కాన్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు రానా కూడా ఆ రూటులోనే వెళ్ళాడు. క‌రోనా త‌ర్వాత వ‌చ్చి ఈ మార్పు కొంద‌రికి క‌లిసి వ‌చ్చింది.
 
తాజాగా ఇలియానాను అమెజాన్ సంస్థ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. స‌రికొత్త కాన్సెప్ట్‌తో అమేజాన్ ప్రైమ్ కూడా ఈ బాటలోనే నడవబోతోంది. ఒక పెద్ద టాక్ షోను నడిపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక స్పెషల్ హోస్ట్‌ను రెడీ చేసినట్లు తెలిసింది.

అంద‌రికీ తెలిసిన ఇలియానా అయితే బెట‌ర్ వారు బోర్డ్ స‌భ్యులు తీర్మానించిన‌ట్లు స‌మాచారం. అందుకే ఆమెకు భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే కాన్సెప్ట్ స‌రికొత్త‌గా వుండాల‌ని చూస్తున్నారు. ముందుగా సెల‌బ్రిటీల‌తో ఇంట‌ర్వూచేయాల‌ని తెలిసింది. ఇది ఆమెకూ ఉప‌యోగ‌ప‌డుతుంది కాబ‌ట్టి దాని ద్వారానైనా సినిమా అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.