పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశారు.
ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాగా, అశేష ప్రేక్షకాదరణ పొందింది. రూ.85 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెలుగులో బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా నిలిచింది.
గతంలో 'అత్తారింటికి దారేది' చిత్రం రూ.82 కోట్లు వసూలు చేస్తే, ఇప్పుడు "వకీల్ సాబ్" ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. కరోనా వలన ఈ సినిమా కలెక్షన్స్‌కు భారీ గండి పడింది.
తొలి వారం 'వకీల్ సాబ్' థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ కాగా, రెండో వారానికి పరిస్థితులు అన్ని తారుమారు అయ్యాయి. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో జనాలు థియేటర్స్‌కు రావడమే మానేశారు.
దీంతో చేసేదం లేక 'వకీల్ సాబ్' చిత్రాన్ని ఏప్రిల్ 30(నేడు) నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 50 రోజుల తర్వాత వకీల్ సాబ్‌ను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు కాని, పరిస్తితుల వలన ముందే స్ట్రీమిగ్ చేయక తప్పలేదు.
ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలను పోషించారు.