యోగా మనలోని ఫ్రెండ్ అంటున్న అమితాబ్, హేమామాలిని, శిల్పాశెట్టి
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సినీరంగ ప్రముఖులు తాము చేస్తున్న యోగా గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ యోగా ప్రకియలో భాగంగా ధ్యానం చేస్తున్న ఫొటో పెట్టి, యోగా అనేది మీ ఫ్రెండ్. దాన్ని జాగ్రత్తగా చూసుకోండని కొటేషన్ పెట్టాడు. హేమామాలిని కూడా చక్కటి కుటీరంలో ధ్యానం చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అదే విధంగా శిల్పాశెట్టి ఈరోజు సాయంత్రం 6గంటలకు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యోగాలోని ప్రాణామాయం గురించి చెబుతాను. బీ రెడీ అంటోంది.
మరోవైపు సంజనా గర్లాన్నిఈరోజు యోగా క్లబ్ తన ట్రైనీతో కలిసి విన్యాసాలు చేస్తూ కనిపించింది. సోనీ చరిస్టా అనే నటి తనదైన శైలిలో యోగా చేస్తోంది. ఇలా సైనికులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా నటీనటీలు యోగాసనాలు వేస్తూ తమ సంబంధించిన వీడియోలను ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
శిల్పాశెట్టి యోగా గురించి చెబుతూ, శ్వాస అనేది శరీరం చేసే అతి ముఖ్యమైన పని. జ్ఞానం నుండి జీర్ణక్రియ వరకు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే వరకు అన్ని కీలకమైన ప్రక్రియలను నిర్వహించడానికి అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి కుడి శ్వాస సహాయపడుతుంది. కాబట్టి, ప్రపంచ యోగ దినోత్సవం రోజున, భ్రమరి ప్రాణాయామం సాధన చేయడం ద్వారా ప్రారంభిద్దాం. ఇది హమ్మింగ్ శబ్దం, ఓమ్ యొక్క కంపనాల ద్వారా 15% ఎక్కువ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది కోవిడ్ -19 నుండి త్వరగా కోలుకోవడానికి మరియు వైద్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు భ్రమరి ప్రాణాయామంతో మీ శ్వాసపై దృష్టి పెట్టడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. ఇది మనస్సును సడలించింది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. దానికి ఈరోజు సాయంత్రం సిద్దంగా వుండడండి అంటూ చెప్పింది.
డ్రీమ్‌గర్ల్‌మమాలిని కూడా, మళ్ళీ యోగా రౌండ్ వచ్చింది.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి వ్యాయామం, యోగా యొక్క ప్రాముఖ్యతను నేర్పింది. యోగా యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇలా పలువురు పలురకాలుగా స్పందించారు. దానికి అభిమానులు కూడా బాగానే స్పందించారు.