1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (15:53 IST)

నటుడిగా నిలబెట్టిన గాలోడు: రవిరెడ్డి

Ravi Reddy, Sudhirgali Sudhir
Ravi Reddy, Sudhirgali Sudhir
ఒకే ఒక్క సినిమా "కెరీర్"ను మార్చేస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అలాంటి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తనకు "గాలోడు" రూపంలో ఓ ఘన విజయం లభించిందని అంటున్నారు అమెరికా రిటర్నడ్ బిజినెస్ మేన్ రవిరెడ్డి. "గాలోడు" సాధిస్తున్న అసాధారణ విజయం తనను గాల్లో విహరించేలా చేస్తున్నదని చెబుతున్నారు.
 
"ఇంటిలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాప్ట్వేర్ సుధీర్" తదితర చిత్రాలతో నటుడిగా ఇప్పటికే తన సత్తాను ఘనంగా చాటుకున్న రవిరెడ్డి... "గాలోడు" చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో సముచిత పాత్ర పోషిస్తూ... అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేయడంతోపాటు... ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని, అక్కడ మోడలింగ్ సైతం చేసిన రవిరెడ్డి ఇప్పుడు టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారిస్తున్నారు. "గాలోడు" చిత్రంలో హీరోయిన్ ఫాదర్ గా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి... "స్టైలిష్ అండ్ హ్యండ్సం ఫాదర్ రోల్"తో తన నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత "రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల"కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు రవి రెడ్డి