2016 ఘంటా అవార్డులు : వరస్ట్ యాక్టర్‌గా షారూక్ ఖాన్
ప్రతి యేడాది బాలీవుడ్‌లో విడుదలైన చిత్రాలలో చెత్తవాటికి ''ఘంటా'' అవార్డులు ప్రకటిస్తున్న విషయంతెలిసిందే. అయితే గతేడాది (2015)కు గాను ''ఘంటా అవార్డు'' విజేతలను ప్రకటించింది. ''దిల్ వాలే'' చిత్రంలో నటనకుగాను బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 2016 ఘంటా అవార్డుల్లో వరస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ''ప్రేమ్ రతన్ ధన్ పాయో'' చెత్త సినిమాగా ఎంపికైంది.
అంతేకాక చెత్త నటిగా సోనమ్ కపూర్, ఈ చిత్రం టైటిల్ ట్రాక్‌కు చెత్త సాంగ్‌కు అవార్డులు దక్కాయి. సల్మాన్ సోదరుడిగా నటించిన నితిన్ ముఖేశ్ చెత్త సహాయ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. 'షాందార్'ను తెరకెక్కించిన వికాస్ బహల్ చెత్త దర్శకుడిగా ఎంపికయ్యాడు.
కొత్తగా పరిచయమైన చెత్త నటుడిగా సూరజ్ పంచోలి గెలుచుకున్నాడు. ''బాంబే వెల్వెట్''లో కరణ్ జోహార్ విలన్‌గా నటించడాన్ని వరస్ట్ మిస్ కాస్టింగ్‌గా ఎంపికయ్యాడు. "అలోన్'' డ్యుయల్ రోల్ చేసిన బిపాసా బసు వరస్ట్ కఫుల్ అవార్డును దక్కించుకుంది.