మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 జూన్ 2018 (20:19 IST)

రానా సర్... గాడ్ బ్లెస్ యూ... శ్రీరెడ్డి

శ్రీరెడ్డి తాజాగా ఫేస్ బుక్కులో ఓ పోస్ట్ చేసింది. అదేమిటంటే... రానా అనారోగ్యం బారిన పడటం తనకు చాలా బాధేస్తుందని వెల్లడించింది. అంతేకాదు... రానా సర్... గాడ్ బ్లెస్ యూ అంటూ వ్యాఖ్య జోడించింది. ఇదిలావుంటే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏదో విధంగా చూస్తూ వై

శ్రీరెడ్డి తాజాగా ఫేస్ బుక్కులో ఓ పోస్ట్ చేసింది. అదేమిటంటే... రానా అనారోగ్యం బారిన పడటం తనకు చాలా బాధేస్తుందని వెల్లడించింది. అంతేకాదు... రానా సర్... గాడ్ బ్లెస్ యూ అంటూ వ్యాఖ్య జోడించింది. ఇదిలావుంటే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏదో విధంగా చూస్తూ వైరల్ చేయడం ఇప్పుడు నెటిజన్లకు అలవాటుగా మారింది. ఇప్పుడు వైవా హర్ష గురించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి తెగ షేర్ అవుతుంది.
 
అందులో ఏమున్నదయ్యా అంటే... వైవా హర్ష తన గురించి అవాకులు చెవాకులు పేలుతున్నట్లు తనకు తెలిసిందనీ, అతడు తనకు ఎదురైతే చాలా చాలా గొడవలు జరిగిపోతాయని అంది. నా ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటా అంటూ వీడియోలో తెలిపింది. కాగా సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయిన వ్యక్తుల్లో వైవా హర్ష ఒకరు. చూడడానికి నల్లగా ఉన్నా అతనిలో ఎంతో టాలెంట్ ఉందిరా అన్న వారు లేకపోలేదు. వైవా హర్ష ఒక్క వీడియో పెట్టాడంటే చాలు లక్షలమందికి ఆ వీడియోను చూసి లైక్ చేస్తారు.
 
అలాంటి వైవా హర్షను చూస్తే మాత్రం తను ఊరకనే వుండలేనని అంటోంది శ్రీరెడ్డి. అదీ సంగతి.