1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (10:16 IST)

'నంది' అవార్డులపై గుణశేఖర్ ఆవేదన...

మహిళా సాధికారతని చాటి చెబుతూ తీసిన 'రుద్రమదేవి' సినిమా ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపిక కాలేకపోయిందని సినిమా డైరెక్టర్‌ గుణశేఖర్ ప్రశ్నించారు. ఈమేరకు గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

మహిళా సాధికారతని చాటి చెబుతూ తీసిన 'రుద్రమదేవి' సినిమా ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపిక కాలేకపోయిందని సినిమా డైరెక్టర్‌ గుణశేఖర్ ప్రశ్నించారు. ఈమేరకు గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవికి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా అని లేఖలో గుర్తు చేశారు. 
 
చారిత్రాత్మక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చినప్పుడు తన చిత్రానికి ఎందుకు ఇవ్వలేదన్నది ఎన్నటికీ తేలని శేషప్రశ్నేనా అన్నారు. 2014-16 సంవత్సరాల నంది అవార్డుల విషయంలో ఎవరు ప్రశ్నించినా మూడేళ్లపాటు అవార్డులకు అనర్హులుగా ప్రకటించడంపై మండిపడ్డారు. అసలు మనం ఉన్నది స్వతంత్ర భారతదేశంలోనేనా అని వాపోయారు. రుద్రమదేవిలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తే తనని క్షమించాలని లేఖలో తెలిపారు.