బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (14:00 IST)

#HappyBirthdaySRK : బర్త్‌డే బాయ్ బాలీవుడ్ బాద్ షా

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన హీరో ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే సమాధానం బాలీవుడ్ బాద్ షా. ఈయనకు కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని, కింగ్ ఖాన్ అని కూడా షారుఖ్‌

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన హీరో ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే సమాధానం బాలీవుడ్ బాద్ షా. ఈయనకు కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని, కింగ్ ఖాన్ అని కూడా షారుఖ్‌కు నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సైతం తెలిసిన అలాంటి సెలెబ్రిటీస్‌లో షారుఖ్ ఖాన్ హై ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ బాద్ షా గురువారం 52వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకి విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి బర్త్ డేలు షారూఖ్ మరెన్నో జరుపుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
 
కాగా, మొదట టీవీ సీరియల్స్‌తో ఆడియన్స్‌కు పరిచయమైన షారుఖ్ 1992లో 'దీవానా'తో మూవీ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వరస హిట్లు కొట్టాడు. అతను యాక్ట్ చేస్తే సక్సెస్ గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. షారుఖ్ ఖాన్ చేసిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు.. థండర్ సక్సెస్ అయ్యాయి. ఒకే థియేటర్‌లో ఏడాది పాటు ఆడిన సినిమాలూ ఉన్నాయి. 
 
'బాజీగర్', 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే', 'మొహబ్బతే', 'దిల్ తో పాగల్ హై', 'కుచ్ కుచ్ హోతా హై' అతనికి రొమాంటిక్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. తిరుగులేని స్టార్‌డమ్‌ను ఈ కింగ్ ఖాన్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కాజోల్‌తో చేసిన సినిమాలతో... వాళ్లిద్దరికీ హిట్ పెయిర్ అనే పేరొచ్చింది. 'చక్ దే ఇండియా', 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'చెన్నై ఎక్స్‌‌ప్రెస్' మూవీస్‌లో షారుఖ్ కామెడీని కూడా పండించి తనలో మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు.