శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (12:16 IST)

రాధ సాంగ్ రిలీజ్ చేసిన షారుక్... అనుష్క శర్మ ఎలా ఉందంటే... (Video)

బాలీవుడ్ స్టార్ షారుక్‌ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ 'జబ్ హ్యారీ మెట్ సెజల్'. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజైంది. 'మై బని తేరి రాధ' అంటూ సాగే ఈ సాంగ్‌ను షారు

బాలీవుడ్ స్టార్ షారుక్‌ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ 'జబ్ హ్యారీ మెట్ సెజల్'. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజైంది. 'మై బని తేరి రాధ' అంటూ సాగే ఈ సాంగ్‌ను షారుక్‌ఖాన్ అహ్మదాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశాడు.
 
ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా అనుష్కశర్మ నటిస్తుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ షారుక్ లేటెస్ట్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ప్రీతమ్ సంగీతమందిస్తుండగా.. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో షారుక్, అనుష్కతో డ్యాన్స్ చేసి అభిమానులను హోరెత్తించారు.