శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (16:44 IST)

హే... నీ దగ్గర మాల్ ఉందా? కరిష్మా - దీపికా చాటింగ్ ఇదే.. 'మాల్' అంటే డ్రగ్గేనా?

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నలుగురు బాలీవుడ్ హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో - ఎన్సీబీ అధికారులు సమన్లు పంపించారు. ఇది ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో పలువురుని ఎన్సీబీ అరెస్టు చేసింది.
 
ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్లు, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ నుంచి దక్షిణాది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, పలువురు మేనేజర్లు, సినీ పరిశ్రమతో సంబంధాలున్నవారికి ఎన్సీబీ నోటీసులు పంపి, విచారణకు రావాలని ఆదేశించింది.
 
ఈ క్రమంలో వీరందరికీ వ్యతిరేకంగా ఎన్సీబీ వద్ద ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి? వాటిని ఎలా సేకరించారు? తదితర విషయాలపై అధికారులు, అనధికారికంగానే అయినా, మీడియాకు ఉప్పందించారు. వీరందరి వాట్సాప్ చాటింగే వీరిని పట్టించిందని సమాచారం. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్‌కు టాలెంట్ మేనేజర్‌గా ఉండి, ఆపై దీపికా పదుకొణే తరపున కూడా పనిచేసిన జయా సాహా, మొత్తం కేసులో కీలకంగా మారారు. అధికారుల విచారణలో ఆమె పలువురి పేర్లను వెల్లడించగా, వారి చాటింగ్స్‌లో డ్రగ్స్ ప్రస్తావన ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాతే హీరోయిన్లకు నోటీసులు పంపించారు. 
 
ఇక ఈ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు మీడియాకూ చిక్కడంతో అవి వైరల్ అయ్యాయి. తన బిజినెస్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో దీపిక చాటింగ్ చేస్తూ డ్రగ్స్ ప్రస్తావన తెచ్చింది. ఈ చాటింగ్, 2017, అక్టోబర్ 28న రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. విచారణ అధికారుల సమాచారం ప్రకారం...
 
దీపిక: ఓకే... నీ దగ్గర మాల్ ఉందా?
కరిష్మా: ఇంటి దగ్గర ఉంది. నేను ఇప్పుడు బాంద్రాలో ఉన్నాను. నీకు కావాలంటే అమిత్‌ను అడుగుతాను.
దీపిక: సరే అడుగు.
 
ఆపై దీపిక 'ప్లీజ్....' అంటూ మెసేజ్ చేయగా, దీనికి కరిష్మా స్పందిస్తూ, అమిత్ తెచ్చిస్తాడని చెప్పగా, తప్పకుండా తెస్తాడా? అని దీపిక అడిగినట్టు కూడా తెలుస్తోంది.
 
కొంత సమయం తర్వా ఇప్పటివరకూ అతను రాలేదని దీపిక, వస్తున్నాడన్న కరిష్మా, ఏ సమయానికి వాటిని తీసుకునేందుకు వస్తావని కూడా దీపికను కరిష్మా ప్రశ్నించింది. తాను 11.30 నుంచి 12 గంటల మధ్య వస్తానని, అతను ఎప్పటికి వస్తాడని దీపిక ప్రశ్నించగా, 11.30కే మాల్ అందుతుందని, 12 గంటలకు మరొకరికి ఇవ్వాల్సి వుందని కరిష్మా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చాటింగ్‌కు మాల్ అంటే.. మాదకద్రవ్యంగానే ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. అందుకే దీపికతో పాటు.. మరో ముగ్గురు హీరోయిన్లకు ఈ నోటీసులు జారీచేశారు.