ఎవరు కూడా తక్కువేం తినలేదు.. దాని ఫలితమే డిప్రెషన్ (video)

kangana
ఠాగూర్| Last Updated: మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (19:49 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇపుడు మరో నటి దీపికా పదుకొనెను టార్గెట్ చేసింది. బాలీవుడ్ డ్రగ్స్ దందాలో దీపికాతో పాటు కరిష్మా పేరు తెరపైకి వచ్చింది. దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. గతంలో దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లి కోలుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కంగనా ఈ ట్వీట్ చేసింది.

'డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్‌గా కనబడుతున్న కొందరు స్టార్ల పిల్లలు వాళ్ల మేనేజర్లను మాల్ గురించి అడుగుతుంటారు' అన కంగనా చురకలంటించింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికా పదుకొణేను బాయ్‌కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్‌ కోణం గురించి తెలియడంతో దీనిపై దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు డ్రగ్స్‌ డీలర్లను అధికారులు విచారించగా బాలీవుడ్‌లో ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి.

దీనిపై మరింత చదవండి :