మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (15:39 IST)

డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ సమన్లు??

బావీవుడ్ మూవీ ఇండస్ట్రీలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులతో పాటు.. తెలుగు హీరోయిన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీచేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన తర్వాత డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెల్సిందే. 
 
దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వద్ద విచారణ జరుపగా అసలు విషయం బహిర్గతం చేసింది. ముఖ్యంగా, డ్రగ్స్ వాడే పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లను కూడా ఆమె చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఫ్యాషన్ డిజైనర్ సైమన్ కంబట్టల పేలు లీక్ అయ్యాయి. 
 
దీంతో వీరందరికీ ఎన్డీపీసీ సెక్షన్ 67 ప్రకారం సమన్లు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా ఎన్సీబీ కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమన్లను కూడా సోమవారం లేదా మంగళవారాల్లో పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, డ్రగ్స్ కేసులో తన పేరు ఉన్నట్టు వస్తున్న కథనాలు ఆపాలంటా రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆమె తనకు ఎలాంటి మాదకద్రవ్యాలు లేదా మద్యం సేవించే అలవాటు లేదని అఫిడవిట్ సమర్పించిన విషయం తెల్సిందే.