గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (15:30 IST)

చిరు అల్లుడు ప్రయత్నం ఫలిస్తుందా.?

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ "విజేత" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఫరవాలేదు అనిపించింది కానీ.. 'విజేత' మూవీ విజయం సాధించలేదు. దీంతో చాలా కథలు విని ఆఖరికి "సూపర్ మచ్చి" అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతుంది. 
 
అయితే... సూపర్ మచ్చిని ముగించిన వెంటనే ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్‌లో రమణ తేజ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కళ్యాణ్ దేవ్ ఓకే చెప్పాడు. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
 
 ఈ చిత్రానికి 'అశ్వత్థామ' సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత.. వ్యాపారవేత్త అయిన రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. 
 
'కల్కి' సినిమాకు రచయితగా వ్యవహరించిన సాయి తేజ్ ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు. ఈ సినిమాకి  మహతి సాగర్ సంగీతాన్ని అందించనున్నారు. "ఛలో, భీష్మ" సినిమాలు మ్యూజికల్‌గా సక్సెస్ అయ్యాయి. మరోసారి ఆయన ఈ సినిమాతో ఒక మంచి మ్యజికల్ ఆల్బంను ఇస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. దీపావళి కానుకగా నవంబరు 14న టైటిల్‌ను ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేయనున్నారు.