గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (12:04 IST)

బాలయ్య పక్కన చిన్నపిల్లలా పాతికేళ్ళ ప్రయాగ!

యువరత్న నందమూరి బాలకృష్ణ - మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో చిత్రం నిర్మితంకానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాల తర్వాత వస్తున్న మూడో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. అయితే, మూవీలో బాలయ్య సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. ఈమెకు తెలుగులో తొలి ఇదే. అయితే ఇపుడు ఆమెను తప్పించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
దీనికి కారణం లేకపోలేదు. 50 యేళ్ళు పైబడిన బాలయ్య సరసన ప్రయాగ జోడీ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు టెస్ట్ షూట్ చేశారట. అయితే బాలయ్య పక్కన పాతికేళ్ల ప్రయాగ చిన్నపిల్లలా కనిపించిందట. దీంతో ఈ జోడీ బాగోలేదని నిర్ధారణకు వచ్చి ఆమెను సినిమా నుంచి తప్పించినట్టు తాజా సమాచారం. దీంతో హీరోయిన్ వేట మళ్లీ మొదటికి వచ్చినట్టైంది. ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్‌ పాత్రకు పూర్ణను సెలెక్ట్ చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.