శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:59 IST)

తెలంగాణ పోరాట యోధుడు పాత్రలో నందమూరి బాలకృష్ణ

హీరోగా నందమూరి బాలకృష్ణ తనదైన శైలిని చాటారు. తండ్రిని మించిన తనయుడిగా తన పాత్రలో రూపురేఖలను మారుస్తున్నారు. తన తండ్రి లాగే జానపదమైనా, పౌరాణికమైనా, చారిత్రాత్మకమైనా ఏ పాత్ర పోషించినా అందులో తన ముద్రను వేయడం బాలకృష్ణకు ఎంతో ఇష్టం. అలాంటి పాత్రలో తన సత్తాను చాటుతారు.
 
ఆ మధ్య గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం కూడా అటువంటి కోవకు చెందిందే. ఈ క్రమంలో బాలకృష్ణ మరో చారిత్రాత్మక పాత్రపై తన దృష్టి పెట్టారు. తెలంగాణ పోరాట యోధుడు కాకతీయ రుద్రమ నాటి వీరుడు గోన గన్నారెడ్డి పాత్రను పోషించాలని ఆయన కోరుకున్నట్లు చెబుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కోసం కొందరు రచయితలు, పరిశోధకులు బృందం ఏర్పాటు చేశారు.
 
ప్రస్తుతం గోన గన్నారెడ్డికి సంబంధించిన అంశాలు తక్కువగా దొరకడంతో ఇంకా మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చిత్రం బోయపాటి శీను దర్శకత్వంలో సాగుతోంది. ఇది పూర్తవ్వగానే ఆయన గోన గన్నారెడ్డి పాత్రపై పూర్తి దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ మధ్య గుణసశేఖర్ రూపొందించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.