బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (06:45 IST)

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గాంధీ అంటున్న ఆ స్టార్ హీరో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రం ప్రస్తుతం దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రం ప్రస్తుతం దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కొనసాగుతున్నారు. ఈయనను తెలంగాణ గాంధీగా టాలీవుడ్ హీరో సంబోధించారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు. మంచు ఫ్యామిలీకి చెందిన యువ హీరో మంచు మనోజ్. 
 
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలుగు భాషా పరి రక్షణకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలి. 
 
అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను ఖచ్చితంగా తెలుగులోనే రాయాలని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ నిర్ణ‌యం ప‌ట్ల మంచు మ‌నోజ్ సంతోషం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. "మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు.