వరుస పరాజయాలతో డీలాపడిపోయిన నితిన్
వరుస ఫ్లాప్‌లతో హీరోలు ఎలా సతమతమవుతారో నితిన్ కంటే బాగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే తానూ ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల పాటు హిట్‌లు ఇవ్వలేక కనుమరుగయ్యే పరిస్థితుల నుండి కోలుకుని హిట్ సినిమాలను ఇచ్చాడు. అ ఆ సినిమాతో కెరీర్‌లో బెస్ట్ హిట్ కొట్టిన నితిన్ మళ్లీ మూడు వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. ఇప్పుడు సినిమా ఆఫర్లు వస్తున్నా ధైర్యం చేయలేకపోతున్నాడు.
కథ నచ్చి ఓకే చేసినా ఏవో వంకలు చెప్పి సినిమా ప్రారంభించడం లేదు. "శ్రీనివాస కళ్యాణం" ఆగస్టులో రిలీజ్ అయిన తర్వాత మరో సినిమా మెదులుపెట్టలేదు. "ఛలో" దర్శకుడు వెంకీ కుడుముల కథని ఓకే చేసి ఆరు నెలలు దాటుతోన్నా ఇంకా మొదలుపెట్టలేదు. "భీష్మ"తో పాటు చంద్రశేఖర్ ఏలేటి సినిమా అనౌన్స్ చేసిన నితిన్ ఏవో కారణాలు చెబుతూ సినిమాని ప్రారంభించకుండా సదరు దర్శకులని వైపునకు తింటున్నాడని చెప్పుకుంటున్నారు.
మరో సినిమా ఫ్లాప్ అయితే తన కెరీర్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నితిన్ భయపడుతున్నాడు. కానీ శ్రేయోభిలాషులు మాత్రం ఇలా ఊరుకుండిపోతే మొదటికే మోసం వస్తుందని నితిన్‌కి నచ్చజెబుతున్నారు.