గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:49 IST)

కార్తికేయను పొగిడేస్తున్న జేడీ చక్రవర్తి.. దిగాంగన అందమైన అమ్మాయే కాదు?

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చేసుకున్న హీరో కార్తికేయ... ఆ తరువాత రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అందులో ఒకటిగా రూపొందుతున్న 'హిప్పీ' సినిమాకి... టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా, కథానాయికగా దిగాంగన నటిస్తున్నారు. 
 
ఈ సినిమా అప్‌డేట్స్ ఇచ్చేందుకు నిన్న రాత్రి మీడియా యూనిట్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో... జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. "మొదటి రోజు నేను సెట్‌లోకి అడుగుపెట్టేసరికి కార్తికేయపై యాక్షన్ సీన్ తీస్తున్నారు. మనోడి ఫెర్పార్మెన్స్ చూసి మిగతా హీరోల అవకాశాలను తన్నుకుపోయేలా ఉన్నాడుగా అనుకున్నాను. హీరోగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది." అని చెప్పుకొచ్చారు. 
 
ఇక దిగాంగన గురించి చెప్తూ... "దిగాంగన అందమైన అమ్మాయే కాదు .. చురుకైన అమ్మాయి కూడా .. చాలా బాగా చేస్తోంది" అంటూ కితాబిచ్చేసాడు. మరి సదరు సినిమాలో వీరి నటన ఎలా ఉందో కానీ... యూనిట్‌లోని ఇతర సభ్యుల ప్రశంసలైతే బాగానే ఉన్నాయి... చూద్దాం మరి ఎలా ఉండనుందో.