గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (19:19 IST)

సామజవరగమన లో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ పై హోలా రే హోలా పాట

Srivishnu, Reba Monica
Srivishnu, Reba Monica
హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన' తో హిలేరియస్ ఎంటర్ టైమెంట్ అందించడానికి సిద్ధంగా వున్నారు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్, ఇతర ప్రమోషనల్ స్టప్ స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేసి క్యురియాసిటీ పెంచాయి. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.
 
 తాజాగా ఈ చిత్రం నుంచి హోలా రే హోలా అనే పాటని విడుదల చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఆకట్టుకునే మెలోడీలా కంపోజ్ చేశారు. జెవి సుధాన్షు & సోనీ కొమందూరి పాడిన ఈ పాటకు శ్రీమణి అందించిన లిరిక్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ప్లజంట్ గా వుంది. పాటలో విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి.
 
ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
 
జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.